భారతీయ జనతా పార్టీ
తెలంగాణ
ఓర్పు, ప్రేమ, నిజాయితి మన అస్త్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు. - స్వామి వివేకానంద
భాజపా తెలంగాణ వార్తలు

వరంగల్ లో పత్తిపరిశోధనా కేంద్రం – దత్తాత్రేయ!

సోమవారం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ; కేంద్ర జౌళిశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ని  డిల్లీ లోని ఆయన కార్యాలయంలో కలిసారు.ఈ సందర్భంగా  సంతోష్‌కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఒక టెక్స్‌ టైల్ పార్కును, పత్తి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని చూపించి దానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేసినట్లయితే”..... వరంగల్ జిల్లాల్లో ఒక టెక్స్‌ టైల్ పార్కును, పత్తి పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి హామీ ఇచ్చా”రని తెలిపారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందిన15 రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తామని కేంద్రమంత్రి తెలిపారని దత్తాత్రేయ వివరించారు ! 

11 August,2015

 • ఆదాయం పెరిగితే ఆంక్షలెందుకు? – నాగం.

  రాష్ట్ర బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ... “ఒక పక్క ఆదాయం పెరిగిందని చెప్తూనే, మరో పక్క నిధుల విడుదలపై ఆంక్షల్ని ఎందుకు విధిస్తున్నారు? బిల్లుల చెల్లింపు, నిధుల వ్యయంపై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రమని, మిగులు రాబడి ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ... గత నెల రోజుల నుంచి అన్ని రకాల బిల్లుల చెల్లింపులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు...!

  24 July,2015

 • జల హారానికి 35 వేల కోట్లు దండగ – నాగం.

  నిన్న మంగళ వారం BJP నేత నాగం జనార్ధన్ రెడ్డి బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో విలేకర్లతో మాట్లాడుతూ... “రాష్ట్ర ప్రభుత్వం 12 వేల కోట్లు ఖర్చు పెడితే  రాష్ట్రం లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు లన్నీ పూర్తౌతాయి .సాగు నీటితో పాటు ఇంటికి 1 కాదు...; 2 నల్లాలు ఏర్పాటు చేయవచ్చు... అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జల హారానికి (వాటర్ గ్రిడ్) 35 వేల కోట్లు ఖర్చు పెట్టడం లో ఆంతర్య మేమిటి? బహుశా ఆనాటి YS రాజ శేఖర్ రెడ్డి ఆత్మ ఈ నాటి KCR ని ఆవహించిందేమో, మరో “జలయజ్ఞం” కోసమే ఇదంతా చేస్తున్నారేమో  “ .... అంటూ    కెసిఆర్ ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు .మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి కోట్లు పెడితే అదనంగా మరో 8 లక్షల ఎకరాలను పంటనీరందించ వచ్చు! ప్రభుత్వం ఆర్ధిక స్థితి మీద శ్వేత పత్రం విడుదల చేయాలని ఈ సందర్భం గా ఆయన కోరారు...!   

  22 July,2015

 • సమగ్ర తెలంగాణా అభివృద్దిపై చర్చకు సిద్ధమా? – లక్ష్మణ్!

  తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాదిలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమని... టీఆర్‌ఎస్‌ ఎంపీలు సిద్ధమా? అని బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్‌ సవాలు విసిరారు. తెలంగాణ నుంచి ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఏడాది పాలనలో.. నేర వెరచిన హామీల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే  కేంద్రంపై TRS విమర్శలు చేస్తోందని  అన్నారు.  తెలంగాణ సమగ్రాభివృద్ధికి మోదీ సర్కారు చేస్తున్న సహాయాన్ని వివరిస్తూ...”14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణకు నిధులను 42 శాతానికి పెంచిందనీ, పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి శాఖలకు ఏడాదిలో రూ.8,764 కోట్ల గ్రాంటు ఇచ్చిందనీ,  నల్లగొండ జిల్లాకు ఎయిమ్స్‌, మెదక్‌లో ఉద్యానవన వర్సిటీ, ఆదిలాబాద్‌లో గిరిజనవర్సిటీలను కేంద్రం మంజూరు చేసిందనీ”, అన్నారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకు రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్తు ప్రాజెక్టులు మంజూరు చేసిందనీ, రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల విద్యుదుత్పాదనకు కేంద్రం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని, ఐడీపీఎల్‌ సంస్థను పునరుద్ధరిస్తోందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు రూ.75 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీకి ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని.. నల్లగొండలో ఫ్లోరైడ్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని, వరంగల్‌ను హెరిటేజ్‌ సిటీగా గుర్తించిందని, ఖమ్మం, మహబూబ్‌నగర్లలో రెండు మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు రూ.110 కోట్ల సబ్సిడీని కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించిందన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌లను స్మార్ట్‌సిటీల కింద గుర్తించి.. వీటి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు.

  20 July,2015

మరిన్ని వార్తలు...
జాతీయ వార్తలు
 • ప్రపంచమా...నువ్వెటువైపు?

  U.A.E.లో రెండురోజుల పర్యటనలో ఉన్న ప్రధాని సోమవారం రాత్రి దుబాయ్‌లోని క్రికెట్ స్టేడియంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. 32,000 సీట్ల సామర్థ్యమున్న ఈ స్టేడియం దాదాపు 50,000 మందితో కిక్కిరిసిపోయింది.ఆ వేదికం పైనుంచీ ప్రధాని ప్రసంగిస్తూ – “పొరుగు దేశాలపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు ఎవరూ మద్దతివ్వరాద”ని  పిలుపునిచ్చారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలవైపు ఉంటుందో..! వాటికి వ్యతిరేకంగా పోరాడుతుందో..! తేల్చుకోవాలని సూచించారు. మంచి తాలిబన్-చెడు తాలిబన్, మంచి ఉగ్రవాదం- చెడు ఉగ్రవాదమంటూ ఏమీ ఉండవని ఆయన స్పష్టంచేశారు. ఉగ్రవాదంతో భారత్ 40 ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నదని, ఎంతో మంది అమాయకులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.       యూఏఈ నలుమూలల నుంచి తరలివచ్చిన భారతీయులంతా “మోదీ”.. “మోదీ” అని పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా “భారత్ మాతాకీ జై” అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను ఓ మినీ భారత్‌ను చూస్తున్నానని పేర్కొన్నారు. దాదాపు 70 నిమిషాలపాటు ఆయన ఉత్సాహంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా గల్ఫ్‌ లోని ప్రవాస భారతీయ కార్మికుల సంక్షేమానికి ఓ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ముఖ్యంగా విదేశాల్లో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఈ నిధిద్వారా సహాయం అందిస్తారు. భారత వలసకార్మికుల కోసం ఈ-మైగ్రంట్ పోర్టల్‌ను, “మదత్” పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.                         ఉగ్రవాదంపై భారత్ వాదనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. కొంతకాలం క్రితం విదేశీ నేతలతో ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావించినప్పుడు అది మీ సొంత శాంతిభద్రతల సమస్య అనేవారు. కానీ ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని ఇప్పుడు వాళ్లు అర్థంచేసుకున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉగ్రవాదం అనే పదాన్ని అసహ్యించుకుంటున్నది. ఉగ్రవాదంవైపు ఉంటారో! లేక మానవత్వంవైపు నిలబడతారో! ప్రతి ఒక్కరు నిర్ణయించుకోవాలి.ఏ విషయంలోనూ హింసామార్గం సరైందికాదు. అన్నింటికీ చివరకు చర్చలద్వారానే పరిష్కారం లభిస్తుంది. ఆ విషయాన్ని గుర్తెరిగే మేం కేవలం నెలలోపలే 70 ఏండ్లుగా కొనసాగుతున్న నాగా తిరుగుబాటుకు శాంతిమార్గం కనుగొన్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా - U.A.E.- భారత్ విడుదలచేసిన సంయుక్త ప్రకటన టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు స్పష్టమైన సంకేతం. అది అర్థంకావాల్సిన (పాకిస్థాన్‌ను ఉద్దేశించి) వారికి అర్థమవుతుంది. 70 ఏండ్లుగా ప్రపంచంలో యుద్ధాలు సంభవించకుండా ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తున్నది. కానీ, ఉగ్రవాదం అనే పదాన్ని నిర్వచించలేకపోతున్నది వ్యాఖ్యానించారు.                                          గల్ఫ్‌దేశాల్లోని ప్రవాస భారతీయులు మాతృభూమికి అందిస్తున్న సహకారం మరువలేనిదని మోదీ అన్నారు. అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ అణుపరీక్షలు నిర్వహిస్తే ప్రపంచం మొత్తం ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆ కష్టకాలంలో భారత్‌కు ఆర్థిక బలాన్ని ఇచ్చినవారిలో గల్ఫ్‌ లోని భారతీయులదే ప్రథమస్థానం. ఈ దేశంలో మీ గొప్ప ప్రవర్తనకు మేం ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాం. భారత్‌లో వర్షం పడితే.. మా మంచికోసం మీరు ఇక్కడ మీ గొడులను పడుతారు. ఈ కార్యక్రమానికి కేరళీయులే అధికంగా వచ్చారు. నేడు (సోమవారం) కేరళ నూతన సంవత్సరం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు. యూఏఈ యువరాజు తన ఐదుగురు సోదరులతో కలిసివచ్చి నాకు స్వాగతం పలికారు. ఈ గౌరవం ఒక వ్యక్తికి కాదు. మొత్తం 125 కోట్లమంది భారతీయులకు లభించినది. యువరాజుకు కృతజ్ఞతలు అని అన్నారు.                                 ఏ దేశానికైనా పొరుగుదేశాలతో సత్సంబంధాలు ఉండటం అత్యంత్య కీలకమని ప్రధాని మోదీ అన్నారు. అందువల్లనే తాము పొరుగుదేశాలతో సంబంధాల బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నేడు ఢిల్లీలోని ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి కనిపిస్తున్నది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు వివాదాన్ని కొద్ది నెలల్లోనే పరిష్కరించాం. భూకంపంతో నేపాల్ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేతనైనంత సాయం చేశాం. పొరుగుదేశమైన నేపాల్ కష్టాల్లో ఉంటే మనమెలా సంతోషంగా ఉంటాం? శ్రీలంకలోని జాఫ్నా (అంతర్యుద్ధ బాధిత ప్రాంతం)లో పర్యటించి అక్కడి ప్రజల కష్టాలు విన్నాం. వారి కన్నీళ్లు తుడిచాం. ఒక దేశంలో తాగటానికే నీళ్లు లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మాల్దీవుల్లో ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ దేశం ఒక్క సందేశం పంపితే క్షణం ఆలస్యం చేయకుండా విమానాలు, షిప్పుల ద్వారా నీటిని తరలించాం. ఆఫ్ఘనిస్థాన్ సుస్థిరత నెలకొనాలని భారత్ అనునిత్యం కోరుకొంటున్నది. మనందరికీ కాబూలీవాలా సుపరిచితుడు. సార్క్‌ కు కొత్త రూపునిచ్చి సభ్య దేశాల అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్నాం. సభ్యదేశాలకు ఉచితంగా సార్క్ శాటిలైట్‌ను అందజేయాలని నిర్ణయించాం. పొరుగుదేశాలతో భుజం భుజం కలిపి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. కొద్దిమందికి (పాకిస్థాన్) సమస్యలున్నంత మాత్రాన మనం ఆగిపోవాలా? వారిని అక్కడే వదిలేసి ముందుకు కదులుదాం. అనుసంధాన నెట్‌వర్క్ అభివృద్ధిపై ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లు సంతకం చేశాయి. సుదూర ప్రయాణంలో ఇది ఎంతో కీలక నిర్ణయం అని తెలిపారు.  

  18 August,2015

 • లక్షకోట్ల డాలర్ల పెట్టుబడితో రండి!

  భారత్‌లో వివిధ రంగాల్లో తక్షణం లక్ష కోట్ల అమెరికన్ డాలర్ల (రూ.65.33 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతే నంబర్‌వన్ అని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తోపాటు ఆర్థిక రేటింగ్ సంస్థ మూడీ కూడా ఏకగ్రీవంగా అంగీకరించాయని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. 

  18 August,2015

 • మస్దర్ నగరాన్ని సందర్శించిన మోదీ!

  యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ రెండోరోజు స్మార్ట్‌సిటీగా పేరొందిన మస్దర్ నగరాన్ని చుట్టివచ్చారు. కర్బన ఉద్గారాలు లేని, పునరుత్పాదక ఇంధనం ఆధారిత శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు నిలయమైన మస్దర్ నగరంలో డ్రైవర్ అవసరంలేని కారు (స్వయం చాలిత వాహనం)లో సుమారు గంటసేపు పర్యటించారు. నగర ప్రైవేట్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ)కి చెందిన ఆ కారు సౌర శక్తితో చార్జ్ అయ్యే లిథియం బ్యాటరీలతో నడుస్తుంది. ఆ కారు గమనాన్ని సాఫ్ట్‌వేర్ సాయంతో నియంత్రిస్తారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు మోదీకి నగర విశేషాలను వివరించారు. వందల సంఖ్యలో భారతీయులు రోడ్లపై నిలిచి ప్రధానికి స్వాగతం పలికారు. నగరంలోని ఓ సందర్శకుల డిజిటల్ పుస్తకంలో మోదీ శాస్త్రవిజ్ఞానమే జీవితం అని రాశారు. మేము ప్రధాని ఇక్కడి  కొన్ని ప్రదేశాలకు ఆయన కాలి నడకన వెళ్లారు.

  18 August,2015

 • మధ్యప్రదేశ్ స్థానికంలో బీజేపీ హవా

  వ్యాపం కుంభకోణం నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల  విమర్శలు వెల్లువెత్తుతున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించింది.                       రాష్ట్రంలోని పది మున్సిపాలిటీలకు ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎనిమిదింటిని కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఒకే ఒక్క మున్సిపాలిటీతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేయగా.. పలు కారణాలతో అప్పడు ఎన్నికలు జరుగని స్థానాలకు తాజాగా నిర్వహించారు.                              బీజేపీ విజయం నేపథ్యంలో రాష్ట్ర ఓటర్లకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. మరో బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో మున్సిపల్ ఎన్నికలు ఈ రోజు జరుగనున్నాయి. 

  17 August,2015

 • పని మనుషులకు కూడా ఇకపై కనీస వేతనం – దత్తాత్రేయ!

  ఇంటిపని కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు జాతీయ విధానాన్ని తేవాలని కేంద్రం భావిస్తున్నది. ప్రతిపాదిత విధానం ప్రకారం పూర్తిస్థాయి నిపుణులైన ఇంటిపని కార్మికులకు ప్రతి నెలా రూ.9000 కనీస వేతనంతోపాటు సామాజిక భద్రత, ఇతర బెనిఫిట్లు, అమలులోకి వస్తాయి. మెటర్నిటీ లీవ్‌తోపాటు ప్రతియేటా 15 రోజుల పాటు సెలవులు తప్పనిసరి. లైంగిక వేధింపులు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా విద్యాభ్యాస హక్కుతోపాటు ఇంటి పని కార్మికులకు సురక్షితంగా పనిచేసే వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. వారి సంక్షేమం, భద్రత చాలా ముఖ్యం అని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారుదత్తాత్రేయ పీటీఐకి చెప్పారు.వారి ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు వ్యవస్థను రూపొందిస్తారు. ఇంటిపని కార్మికుల సామాజిక భద్రతా పథకాల అమలుకు ప్రతి యజమాని వద్ద నుంచి వాటా చెల్లింపు తప్పనిసరి కానున్నది. ఇంటిపని కార్మికుల శ్రమదోపిడీని నివారించేందుకు జాతీయ విధానం రూపొందించాల్సి ఉంది. వారి సంక్షేమం, భద్రత చాలా ముఖ్యం అని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారుదత్తాత్రేయ పీటీఐకి చెప్పారు.

  17 August,2015

 • పార్లమెంట్ ని ప్రోరోగ్ చేయబోవడం లేదు!

  విపక్షాల రాజకీయ ఆధిపత్యపోరులో పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు మొత్తం నిష్ఫలమయ్యాయి. కీలక బిల్లులకు ఆమోదం తెలుపకుండానే ఉభయసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. లలిత్‌గేట్, వ్యాపం కుంభకోణంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధరారాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌లను పదవుల నుంచి తప్పించాలని కాంగ్రెస్‌సహా విపక్షాలన్నీ పట్టుబట్టి సమావేశాలను అడ్డుకోవటంతో సెషన్ ఆసాంతం ఉభయసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి.        దాంతో దేశంలో పన్ను వ్యవస్థను సమూలంగా మార్చేందుకు తెచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లు, కీలకమైన భూసేకరణ బిల్లు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ సమావేశాలు నిష్ఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి వర్షాకాల ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నరేంద్రమోదీ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం పార్లమెంటును ప్రొరోగ్ చేయరాదని నిర్ణయించింది. 

  14 August,2015

మరిన్ని వార్తలు...
భాజపా వార్తలు
 • పార్లమెంట్ ప్రతిష్టoభన : కాంగ్రేస్ మీద ప్రధాని అసంతృప్తి..!

  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు వ్యక్తులు పార్లమెంటును దుర్వినియోగం చేస్తూ దేశ ప్రగతికి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేతలపై మండిపడ్డారు. ఈ కుట్రలను సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ అర్థంచేసుకున్నారని ప్రశంసించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ములాయంతోపాటు కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ఇతర విపక్ష పార్టీలను మోదీ ప్రశంసించారని సమావేశం అనంతరం కేంద్రమంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీ తెలిపారు. కేంద్రం చేపట్టిన ప్రజాసంక్షేమ, భద్రత పథకాలపై ఈ నెల చివరలో వస్తున్న రాఖీ పండుగ వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని సూచించినట్లు రూడీ వెల్లడించారు. 

  12 August,2015

 • అఖిలేష్ యాదవ్ ని గీత కుటుంబo ఫోటోలు పంపమన్న సుష్మా స్వరాజ్

  విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారికి  ట్వీట్ చేస్తూ పాకిస్తాన్ లో ఉన్న మన దేశపు అమ్మాయి గీత కుటుంబానికి చెందిన ఫోటోలను పంపమనీ....వాటిని తను పాకిస్తాన్లో ఉన్న గీతకు పంపి  వివరాలు కనుక్కుoటాననీ తెలిపారు.

  12 August,2015

 • పార్లమెంట్ లో నిన్న!

  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ వ్యాపం, లలిత్‌గేట్‌పై ఆందోళన చేస్తూ సభలను స్తంభింపజేస్తున్న కాంగ్రెస్ పార్టీ, మంగళవారం నిరసనను మరింత పెంచింది. లోక్‌సభ మంగళవారం ప్రారంభంకాగానే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారికి వామపక్ష సభ్యులు కూడా తోడయ్యారు. కుల గణన వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆర్జేడీ, జేడీయూ సభ్యులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో ఒక దశలో తీవ్ర గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ సభ్యులు, తమ చేతుల్లోని పేపర్లను చించి స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ తంబిదురైపైకి విసిరారు. దాంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్రంగా స్పందించారు. విపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆక్షేపించారు. సమావేశాల గడువు మరో రెండురోజులే మిగిలి ఉండటంతో  గత్యంతరం లేక కేంద్ర మంత్రి ఉమాభారతి, బీజేపీ నేతలు జగదాంబికాపాల్, కిరణ్‌ఖేర్ తదితరులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. దాంతో ఎలాంటి చర్చ లేకుండానే సభ బుధవారానికి వాయిదా పడింది. 

  12 August,2015

 • రాజ్యసభలో G.S.T.బిల్లుప్రవేశ పెట్టిన జైట్లీ !

  సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న G.S.T  బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపు కు గడువు మరో రెండు రోజులే ఉండటంతో ఈ బిల్లును రాజ్యసభ సలహా సంఘంలో చర్చించకుండానే సభ ముందుంచారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే ఆర్థిక, రైల్వేశాఖలకు చెందిన జీఎస్టీ అనుబంధ బిల్లులను సభ ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. ఆ తర్వాత జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు అరుణ్‌జైట్లీ సిద్ధంకాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళకు దిగారు. లలిత్‌గేట్, వ్యాపంపై సభలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ సభ్యులు జైట్లీకి అడుగడుగునా అడ్డుతగలటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్యే జైట్లీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.  దాంతో ఎలాంటి చర్చ లేకుండానే సభ బుధవారానికి వాయిదా పడింది. 

  12 August,2015

 • రాజ్య సభలోకి G.S.T. బిల్లు.

  చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తు సేవల పన్ను(G.S.T.) బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. గత మే నెలలో G.S.T బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం విదితమే. అయితే G.S.T ని అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లు నిబంధనల మేరకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఏం జరుగుతుందనేది చూడాలి.ఈ జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.                            ఈ పన్ను విధానంతో ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుందని నాడు లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. జీఎస్టీ బిల్లుతో భవిష్యత్‌లో ధరలు తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని స్పష్టం చేశారు. వస్తు, సేవల పన్ను విధానంలో పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు.

  11 August,2015

 • ప్రధానిని కలిసిన గోపీ కృష్ణ, బలరాం సతీమణులు!

   సోమవారం పార్లమెంట్‌లో బలరాం సతీమణి లక్ష్మి, గోపీకృష్ణ సతీమణి కల్యాణి ప్రధాని మోదీని కలిసి - లిబియాలో ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ భర్తలను విడిపించి, ఇండ్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ వీరిని ఢిల్లీకి తీసుకొచ్చి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ద్వారా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. ఆ తరువాత వారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తో కూడా భేటీ అయ్యారు.                           తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణ అపహరణకు గురై 13 రోజులు గడిచాయి. వారు విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని వారి భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సుష్మాస్వరాజ్‌తో వెంకయ్యఫోన్‌లో మాట్లాడారు. బందీలను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అనంతరం వారు సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అక్కడి ప్రతినిధుల ద్వారా మిలిటెంట్లతో జరుగుతున్న చర్చల వివరాలను సుష్మ వారికి వివరించారు. 

  11 August,2015

మరిన్ని వార్తలు...
tg map
నేటి ప్రశ్న

ప్రభుత్వ అసమర్ధ పాలన వలన రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం దీని పై మీ అభిప్రాయం ?

అంగీకరిస్తున్నాను అంగీకరించలేను చెప్పలేను

మీ నాయకుల్ని అడగండి.

Upcoming Transcripts

Date :TBD

From : AM - AM

The Party President likes to hear from you ! Be it a question or a message, do write...it matters. For the President to know that you feel yourself to be part of the system makes his day.

User Login

Please fill in your username which you used to register with when registering on to this website.

User Details